18-12-2025 02:03:14 AM
భర్తకు తీవ్ర గాయాలు
ఓటేసి వెళ్తుండగా వెంకటాపూర్‌లో ఘటన
మహబూబాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసి వెళ్తుండగా కా రు పల్టీ కొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలో బుధవారం జరిగింది. భూపాలపల్లి సింగరేణి సం స్థలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన అల్వాల దేవేందర్ అపర్ణ దంపతులు కారు లో స్వగ్రామానికి వచ్చి బుధవారం ఉద యం ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి భూపాలపల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో వెంకటాపూర్ వద్ద మూలమలుపు వద్ద కారు ప్రమాదవశాత్తు ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో అపర్ణ అక్కడికక్కడే మరణించగా దేవేందర్ గాయపడ్డాడు.