16-12-2025 12:00:00 AM
డీసీసీ అధ్యక్షుడు వేడ్మ బొజ్జు
బైంసా, డిసెంబర్15 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ ప్రభు త్వంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుం టున్నారని డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడు మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ముధోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
నిర్మల్ జిల్లాలో మొదటి రెండో విడతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను దక్కించుకున్నారని మూడో విడుదల కూడా తమ మద్దతు ధరలు ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేందుకు పార్టీ నాయకులు కష్టప డుతున్నారని తెలిపారు అనంతరం బాసర అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.