1 April, 2026 | 7:07 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి

25-10-2025 12:00 AM

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, అక్టోబర్ 24 ( విజయక్రాంతి ) : పట్టుదల లో భగీరథుడే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని నేను ఎల్లవేళలా భగీరథ మహర్షినే ఆదర్శంగా తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుబడి ఉందన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ రిజర్వేషన్ తెలంగాణలో అమలుపరిచి దేశానికే రోల్ మాడల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రకారం సగరులకు అవకాశం ఉన్నచోట గుర్తింపుని ఇస్తామన్నారు. పెద్దమందడి మండల కేంద్రంలో రూ 20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులుపాల్గొన్నారు.