07-10-2025 12:00:00 AM
గుండాల, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): గుండాల మండల కేంద్రంలోని స్థానిక వాసవి గార్డెన్ లో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో యే స్థానిక సంస్థల ఎలక్షన్లలో గుండాల మండల కేంద్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అన్ని బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
అదేవిధంగా ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామపంచా యతీ గ్రామ శాఖ, కార్యకర్తలు అందరూ ఓకే మాటకు కట్టుబడిగెలిచే అభ్యర్థులనునిర్ణయించాలన్నారు. మండలంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందినటువంటి వారందరినీ కలిసి ఓటు అడగాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి మరిచినటువంటి హామీలను చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రజలందరికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.