07-10-2025 12:00:00 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలునాయక్ నివాసంలో సోమవారం దేవరకొండ, నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, కొండమల్లేపల్లి మండలాల ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావే శన్నీ నిర్వహించారు. అనంతరం వారుమాట్లాడుతూ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పని చేయాలి అని అన్నారు.
రిజర్వేషన్లపై అపోహాలు నమ్మొద్దు పార్టీ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి అని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త, పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు, బలోపేతం చేసిన వారికి అవకాశాలు ఉంటాయని వారు అన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.