27-12-2025 03:13:27 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం నందు డిసెంబర్ 30వ తారీఖున జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల,భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని దేవాలయం అనువంశిక ధర్మకర్తలు విజయకుమార్, మట్టపల్లిరావు, మట్టపల్లి సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు శనివారం వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మంత్రి ని వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి రావాలని ఆహ్వానించారు.వారి వెంట అర్చకులు తదితరులు ఉన్నారు.