27-12-2025 03:18:42 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో గల కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఆ దనపు తరగతి గది మరియు టాయిలెట్స్ ను శనివారం స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణా రావు కి ప్రత్యేక అధికారి స్వప్న తో పాటు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
స్వాగత నృత్యంతో పాటు విద్యార్థినిలు చేసిన పిరమిడ్ను ఎమ్మెల్యే స్వయంగా వీక్షించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పెద్దపల్లి నియోజకవర్గంలో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు వారి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సుల్తానాబాద్ మండలంలో ఉన్న కస్తూరిబా పాఠశాల నియోజకవర్గంలోని ప్రత్యేక స్థానం కలిగి ఉందని అన్నారు, ఈ పాఠశాలలో చదువుతున్న 360 మంది విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని విద్యార్థులు 10వ, 12వ తరగతిలో చక్కటి ఫలితాలనుతీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
రానున్న విద్యా సంవత్సరంలో మరో కొంత మంది విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యంకు ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే మంచినీటి ఇబ్బందిని తొలగించేందుకు కృషి చేస్తానని అన్నారు. మరో 20 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదిల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు కొందరు పెడదారి పడుతున్నారని వారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి వాటిపై శ్రద్ధ వహిస్తున్నారని రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పాఠశాలకు ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించవచ్చని విద్యార్థుల విద్య కోసం ఎప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, భూపతిపూర్ సర్పంచ్ లు పోచంపల్లి చిన్నయ్య , శ్రీ రంగారావు, తిరుమలరావు , నామని రాజిరెడ్డి, వీర గొని రమేష్ గౌడ్, చిలుక సతీష్, కల్లేపల్లి జానీ, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, కవిత , విజయేందర్ రెడ్డి తోపాటు ఉపాధ్యాయినీలు, విద్యార్థినిల తోపాటు పలువురు పాల్గొన్నారు.