27-12-2025 12:00:00 AM
పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి
రాజాపూర్, డిసెంబర్ 26: అధికార కాంగ్రెస్ పార్టీలోకి స్వతంత్ర గా గెలిచిన సర్పంచ్లతో పాటు ఇతర పార్టీల మధ్య ద్వారా గెలిచిన సర్పంచ్ల సైతం కాంగ్రెస్ పార్టీలోకి కడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.
శుక్రవారం రాజపూర్ మండల పరిధిలోని మోత్కులకుంట తాండ స్వతంత్ర సర్పంచ్ సభవత్ గీత కృష్ణా నాయక్, నాయిన్ చెరువు తాండ స్వతంత్ర సర్పంచ్ వెంకట్ నాయక్, జడ్చర్ల మండలం ఈర్లపల్లి స్వతంత్ర సర్పంచ్ మేఘావత్ సరిత నారాయణలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన సర్పంచ్లకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.