07-08-2025 01:00:16 AM
- రోడ్డు ప్రమాదంలో కామ్రేడ్ బోల్లోజు అయోధ్య మృతి
-పోరాటాల సారథి.. అండను కోల్పోయిన ఏజెన్సీ ప్రజలు
మణుగూరు, ఆగస్టు 6 (విజయ క్రాంతి) : కమ్యూనిస్టు ఉద్యమలలో మరో రాజకీయ శిఖరం నేల కొరిగింది. ఐదు దశాబ్దాల పా టు ఎర్రజెండా నీడలో పేదల పక్షాన పయనించిన కామ్రేడ్ బొల్లోజు అయోధ్య విశ్ర మించారు. బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. పినపాక నియోజకవర్గంలో ప్రజా పోరాటాల సారథిగా,ఏజెన్సీ ప్రాంతంలో కమ్యూనిస్టు పోరాటాలకు, ఉ ద్యమాలకు ఆయన ఒక చిరునామాగా, విలువలకూ, త్యాగాలకు, ఆదర్శాలకూ, నిబ ద్ధతకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడుగా. విప్లవోద్య మమే ఊపిరిగా శ్వాసించి, ప్రజల కోసమే అండగా నిలిచారు. 78 ఏళ్ళ జీవన గమనంలో జనమే తప్ప వ్యక్తిగతం లేని అలుపెరుగని విప్లవ సూరీడాయన, నేటి రాజ కీయ చదరంగంలో పదవుల కో సం అనేక రాజకీయ పార్టీలు మారుతూ స్వా ర్ధ రాజకీయాలు రాజ్యమే లుతున్న ఈ రోజుల్లో జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చనిపోయే వరకూ కమ్యూనిస్టు గా జీవించి కమ్యూనిస్టు యోధుడిగా కామ్రేడ్ అయోధ్య నిలిచారు.
తన రాజకీయ పయనంలో ఎన్నెన్నో అణచివేతలు, నిర్బంధాలు గురైనా, గుండె నిబ్బరంతో తాను పట్టుకున్న ఎర్రజెండాను సమున్న తంగా నిలబెట్టిన ధీశాలి.ఏజెన్సీలో ప్రజలకు ఏ కష్టం వచ్చి నా అండగా నిలిచారు. పేదలకు భూములను పంచడం లో విశిష్ట పోరాటాలు నిర్వహించారు. పినపాక నియోజకవర్గం లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాలకు పైగా ప్రజా పోరాట ఉద్యమాల్లో పీడిత జననేతగా వెలుగొందారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన ముద్రతో ముక్కుసూటిగా అజాత శత్రువుగా, ప్రజాసమ స్యల పై గళం వినిపించే నాయకుడిగా పేరొందారు. అపార రాజకీయ అనుభవంతో పిన పాక నియోజక వర్గం లో రాజకీయాలను శాసించారు.కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.వివిధ పార్టీల నాయకులు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.