07-08-2025 12:59:19 AM
చీఫ్ ఇంజినీర్‌ను కలిసి విన్నవించిన డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు
నిర్మల్, ఆగస్టు ౬ (విజయక్రాంతి): శ్రీ రామ్ సాగర్ జలాశయం నుండి సరస్వతీ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో చీఫ్ ఇంజనీ యర్ (ఈఎన్సీ జనరల్) అంజద్ హుస్సేన్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు బుధవారం వినతి పత్రం అందజేశారు.
నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచందా, మామడ మండలాలకు వరప్రదాయని అయిన సరస్వతి కాలువ ద్వారా ఖరీఫ్ సీజ న్‌లో నీటిని విడుదల చేసినట్లయితే రైతులు పంటలు సాగు చేసుకుంటారని పేర్కొన్నారు. స్పందించిన చీఫ్ ఇంజనీర్ గురువా రం నుండి వారబందీ ద్వారా ప్రతిరోజు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతుల పక్షాన అధికా రులకు ధన్యవాదాలు తెలిపారు.