calender_icon.png 9 August, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్టిఫికెట్లు పారదర్శకంగా పరిశీలించాలి

07-08-2025 01:00:31 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు ౬ (విజయక్రాంతి): మెడికల్ కళాశాల పొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల  దృవపత్రాలను పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని అంకుశాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్లు, సహాయ ప్రొఫెసర్ల పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ ప్రక్రియలో భాగంగా జిల్లా అదన పు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్ రెడ్డి లతో కలిసి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రొఫెసర్లు, సహాయ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని, ఈ క్రమంలో పోస్టు ల భర్తీ కొరకు అభ్యర్థుల దృవపత్రాలను పారదర్శకంగా పరిశీలించి, నిష్ణాతులైన వారి ని ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.