calender_icon.png 12 August, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక పఠనంతోనే విజ్ఞానం

12-08-2025 04:58:34 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుందని, ప్రతి విద్యార్థి లైబ్రరీ ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని టీజీటీ ఆర్జేసీ ప్రిన్సిపల్ హర్షిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల(Tribal Welfare Girls Gurukul College)లో జాతీయ లైబ్రేరియన్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం, లైబ్రరీ వినియోగం వల్ల కలిగే లాభాలు, లైబ్రరీ ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీలత, లైబ్రేరియన్ లలిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.