calender_icon.png 15 October, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యయుతంగానే అధ్యక్షుడి ఎంపిక

15-10-2025 01:40:52 AM

ఏఐసీసీ పరిశీలకుడు శరత్ రౌత్

తుంగతుర్తి, అక్టోబర్ 14: కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా, ప్రజాస్వామ్య యుతంగా  నిర్వహించడం జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు, డిసిసి అధ్యక్షుని ఎన్నిక జిల్లా ఇన్చార్జి శరత్ రౌత్  అన్నారు. డిసిసి అధ్యక్షుడు ఎంపికకు సంబంధించి మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామెల్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి తో కలిసి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజాస్వామ్య యుతంగా పార్టీ నాయకులు, కార్యకర్త మనోభావాలను, అభిప్రా యాలను పరిగణలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుని నియామకం చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సమావేశం నిర్వహించామని తెలిపారు.డిసిసి అధ్యక్షుడు నియామకం తర్వాత బ్లాక్, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎంపిక నిర్వహిస్తామని తెలిపారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి డిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని పేర్కొన్నారు ఆనందం ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వ్యక్తికి, అందరినీ సమన్వయపరిచే వ్యక్తికి, అందరి అభిప్రాయాలను తీసుకొని డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.పార్టీలో కష్టపడి పని చేసిన వ్యక్తికి తప్పకుండా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడుతూరాహుల్ గాంధీ దిశా నిర్దేశంతో పారదర్శకంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనుగొనంగా పార్టీకి అంకితభావంతో పనిచేసే వారిని, అందరినీ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించే వ్యక్తిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

రాజకీయ సమీకరణలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దరఖాస్తులను ఏఐసిసికి అందజేయడం జరుగుతుందని పేర్కొ న్నా రు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా  కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా, పారదర్శకంగా డిసిసి అధ్యక్షులను ఎంపిక చేస్తుందని అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్  కార్యక్ర మంలో డిసిసి అధ్యక్షులు ఎంపిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పార్టీలో ఎవరైనా డిసిసి అధ్యక్షుని కోసం దరఖాస్తు  చేసుకోవచ్చని అన్నారు. డిసిసి అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ శ్రేణులు వ్యక్తిగతంగా కానీ,సమిష్టిగా కానీ తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు,పీసీసీ  అధికార ప్రతినిధి అన్నే పర్తి జ్ఞాన సుందర్,

పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,రాష్ర్ట నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, యోగా నంద చార్యులు, ఆకుల బుచ్చిబాబు, పిసిసి, డిసిసి కార్యవర్గ సభ్యులు,9 మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, సంవిధాన్ పాల్గొన్నారు.