calender_icon.png 15 October, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25న హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా

15-10-2025 01:38:35 AM

-150 కంపెనీలలో 10 వేల మందికి ఉపాధి 

-పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ 

సూర్యాపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఈ నెల 25న సూర్యాపేట జిల్లాలో ని హుజూర్‌నగర్ పట్టణం పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం మంత్రి ఉత్తమ్ ఆవిష్కరించారు. తదుపరి తెలంగాణా డిజిటల్ ఎంప్లా యిమెంట్ ఎక్చేంజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్న ఈ జాబ్ మేళాకు సుమారు పదివేల మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరు అవుతా రని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 150 కంపెనీలు ఇందులో పాల్గొననున్నట్లు తెలిపారు. దీనిలో ఐటీ, మ్యానుఫ్యాక్షరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ తదితర పరిశ్రమలు ఉం టాయన్నారు.

జాబ్ మేళా జరుగుతున్న చో ట హెల్ప్‌డెస్క్‌తో పాటు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట కం ప్యూ టర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇం జినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలకు సమాచారం అందించాలన్నారు. ని యామకాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యం లో అధికారులు మరోసారి సమన్వయ స మావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.