30-07-2025 12:51:49 AM
నిర్వాసితులకు న్యాయం చేసి కుడి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్తా
కొత్తకోట జులై 29 : కానాయపల్లి ముం పు బాధితుల సమస్యలో త్వరలో పరిష్కరిం చి పునరావాస కేంద్రానికి గ్రామాన్ని తరలిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సకల సదుపాయాలతో విశాలంగా రూ.43.5 లక్షల వ్యయంతో నిర్మిం చిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభో త్సవం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధం గా, అన్ని సౌకర్యాలతో విశాలంగా కానాయపల్లి పునరావాస కేంద్రం మండల ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని సం తోషించతగ్గా విశయమన్నారు. అదేవిధంగా పునరావాస కేంద్రంలో వడ్డెర కమిటీ హాలు, యాదవ కమిటి హాలు, హమాలి కమిటీ హా లు ఒక్కోటి రూ. 25 లక్షల వ్యయంతో ని ర్మించనున్న భవనాలకు శంఖుస్థాపన చేశా రు.
ముందుగా కొత్తకోట ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల కు శానిటేషన్ కిట్లు పంపిణి చేశారు. ఈ సం దర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ పు నరావాస సమస్యలు పరిష్కరించి 12 గ్రా మాలకు కుడి కాల్వ ద్వారా నీటిని తీసుకెళ్తానని అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంతో పాటు కెనాల్ పనులు సైతం పూర్తి అయినప్పటికీ 10 సంవత్సరాల్లో కానాయపల్లి గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు, ప్రాజెక్టు ద్వారా సాగు నీరు ఇవ్వలేక పోయారని గత పాలకులను విమర్శించారు. తాను ఎన్నికల సందర్భంగా గెలిచాక నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ మేరకు ముందుగా నేడు సకల సౌకర్యాలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.
గ్రా మం నుండి పాఠశాల దూరం అయినందు న కానయపల్లి గ్రామం తరలించే వరకు వి ద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కానాయపల్లి పాఠశాలను జిల్లాలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్ద డం జరుగుతుందని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా త్వరలో నే కానాయపల్లి నిర్వాసితులకు ప్లాట్లు ఇచ్చి వారికి రావాల్సిన నష్ట పరిహారం సైతం ఇ ప్పించి ప్రస్తుతం ఉన్న స్థలం నుండి గ్రామా న్ని పునరావాస కేంద్రానికి తరలించడం జరుగుతోందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ శిథిలావస్తలో ఉన్న కా నాయపల్లి ప్రాథమిక పాఠశాలను పునరావాస కేంద్రంలో కొత్తగా నిర్మించిన భవనం లోకి ఈ రోజు మార్చడం జరిగిందని ఇందు కు సహకారం అందించిన దేవరకద్ర శాసన సభ్యులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. కానాయపల్లి పాఠశాలలో ఎ.ఐ కంప్యూటర్ విద్య ను అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఇంత మంచిగా, విశాలంగా ప్రాథమిక పాఠశాల జిల్లాలో ఎక్కడా లేదని కొనియాడారు. పాఠశాలలో 129 మంది విద్యార్థులు, 6 మంది ఉపాధ్యాయు లు ఉన్నారని, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారు. శంకర్ సముద్రం నిర్వాసితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటానని తెలిపారు. పాఠశాల ఆవరణలో శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ మొక్క లు నాటి నీరు పోశారు.
రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కొత్తకోట పట్టణ కేంద్రంలోని బిపిఆర్ గార్డెన్స్ లో ఆయా గ్రామాలకు సంబందించిన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, మదనాపురం మార్కెట్ కమిటి చైర్మన్ పి. ప్రశాంత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎమ్ ఈ వో కృష్ణయ్య, ఎంపీడీఓ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ సైద య్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజ య్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణా రెడ్డి, రావు ల కరుణాకర్ రెడ్డి, బోయోజ్, బిచుపల్లి యా దవ్, మేస్త్రి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.