30-07-2025 12:51:41 AM
‘సీపీఎల్‌ఆర్‌ఐ’ లో ఒక రోజు శాస్త్రవేత్తగా అవకాశం
మహబూబాబాద్, జూలై 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ తెలంగాణ మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న పనుగోతు ప్రేమ్చంద్ చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (సి ఎల్ ఆర్ ఐ) లో జరిగిన ప్రతిష్టా త్మకమైన ‘ఒక రోజు శాస్త్రవేత్త’కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ మేరకు ఈనెల 25న నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమ్ చంద్ పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు, ఇతర విద్యార్థులు సైన్స్ పట్ల అంకితభావం, ఉత్సా హం నుండి ప్రేరణ పొందే విధంగా తనకు ఈ కార్యక్రమం దోహద పడిందని ప్రేమ్ చంద్ చెప్పారు. సదస్సులో పాల్గొనడానికి మహమ్మద్ అక్తర్, అధ్యాపకులు ప్రోత్సాహం అందించారని పేర్కొన్నాడు.