30-07-2025 12:52:32 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరుణంలో రవాణా పర్మిట్లు, ఇతర అనుమతు లన్నీ ఆన్‌లైన్ ద్వారానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులు అవసరం లేదని కేంద్ర ప్రభు త్వం 2021 సెప్టెంబర్ 6న ఆదేశాలు జారీ చేసింది. చెక్‌పోస్టుల స్థానంలో ఏఐ ఆధారిత సీసీ కెమెరాల నిఘా ద్వారా వాహనాల తని ఖీ చేపట్టనున్నారు.
అలాగే వాహనాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా మొబైల్ స్కాడ్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే సరిహద్దు చెక్‌పోస్టులను తొలగించారు. మిగతా రాష్ట్రాల్లోనూ చెక్‌పోస్టుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశమంతా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని చెక్‌పోస్టులను తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలకు ఇప్పటికే ఓ సర్క్యులర్‌ను సైతం జారీ చేసింది.
పొరుగు రాష్ట్రం ఏపీలోనూ చెక్‌పోస్టులకు మంగళం పాడారు. తెలంగాణలో కూడా ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో చెక్‌పోస్టులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు కాసులను కురిపించే ఈ చెక్‌పోస్టుల్లో డ్యూటీలు వేయించుకునేందుకు ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు ఎక్కడ లేని ఉత్సాహం చూపిం చేవారు.
అందుకే ఈ సర్కారు ఏర్పడిన కొత్తలోనే పలువురు తమకు అక్కడే పోస్టింగులు కావాలంటూ పెద్దఎత్తున పైరవీలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ చెక్‌పో స్టుల్లో దాదాపు 100 మంది వరకు అధికారులు పనిచేస్తున్నారు. చెక్‌పోస్టులను అధికారికంగా తొల గించిన తర్వాత వీరందరికీ ఇతర డ్యూటీలు అప్పగించనున్నారు.
చెక్‌పోస్టులను తొలగించిన రాష్ట్రాల్లో..
చెక్‌పోస్టులను తొలగించిన 22 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. చెక్‌పోస్టుల వద్ద తాత్కాలిక అనుమతుల ద్వారా కోల్పోయే ఆదాయాన్ని ఆన్‌లైన్ విధానంలో జారీ ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక చెక్‌పోస్టుల నుంచి అధికారులు, ఉద్యోగులను ఒకేసారి కాకుండా దశలవారీగా బదిలీ చేస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలు ఆన్‌లైన్ అనుమతులతో వస్తున్నాయో లేదో చెక్ చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ స్కాడ్లను నియమించారు. పొరుగున ఉన్న ఏపీలో ఇలాంటి కసరత్తులే చేస్తున్నారు.
రవాణా..మరింత వేగంగా
చెక్‌పోస్టుల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని లారీల యజమానులు, డ్రైవర్లు అనేకమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. చెక్‌పోస్టుల వద్ద వసూళ్లు కోసం బాగా ఆలస్యం చేయడం వల్ల వివిధ రాష్ట్రాలకు సుదూర ప్రయాణం చేయాల్సిన వాహనాలకు ఆలస్యం అవుతున్నదని వారి ఆరోపణ. అందుకే దమ్మిడి ఆదాయం లేని చెక్‌పోస్టులను వదిలించుకోవాలని సర్కారు నిర్ణయించింది.
ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 34 కి.మీ మేర ప్రయాణిస్తున్నాయి. చెక్‌పోస్టుల తొలగింపు తర్వాత ఇది 54 కి.మీకు పెరిగే అవకాశం ఉందని ఫలితంగా సరుకు రవాణా ఖర్చు తగ్గుతుందని రవాణాశాఖరంగ నిపుణులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. చెక్‌పోస్టుల తొలగింపుతో వేగం పెరగడమే కాకుండా అవినీతి కూడా దాదాపుగా తగ్గిపోనుంది.
ఏఎన్‌పీఆర్ కెమెరాలతో నిఘా..
చెక్‌పోస్టుల తొలగింపు తర్వాత ఏఐ ఆధారిత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి చెక్‌పోస్టు సమీపంలో 1 కి.మీ ముందు గా సుమారు 50 ఏఎన్‌పీఆర్ కెమెరాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను స్కాన్ చేసి వాటి టాక్స్, పీయూసీసీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సహా అన్ని అనుమతులను చెక్ చేసేలా ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తారు.
అన్నీ సక్రమంగా ఉన్న వాహ నాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అనుమతులు లేని వాహనాల వివరాలను సంబంధిత మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లకు సమాచారం పంపిస్తారు. అలాగే మొబైల్ స్కాడ్ వాహనాల ద్వారా నిరంతరం తనిఖీలు, పర్యవేక్షణ చేస్తారు.
వాహన్ సారథి డేటా ఆధారంగా వాహనాల ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్, ఈ బిల్లుల సమా చారం అందుబాటులో ఉంటున్నందున ఆ న్‌లైన్ ఆధారంగా తనిఖీలకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో వచ్చే అధునాతన టెక్నాలజీలను వాడుకుంటూ వాహనాల తనిఖీని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం రాష్ట్రాలకు సహకరిస్తూ వస్తుంది.
ఇవే తెలంగాణలోని చెక్‌పోస్టులు..
ఆదిలాబాద్, భైంసా, వాంకిడి, సాలూర, జహీరాబాద్, మద్నూరు, నాగార్జునసాగర్, విష్ణుపురం, కోదా డ, కల్లూరు, అశ్వారావుపేట, పాల్వం చ, ఆలంపూర్, కృష్ణా, కామారెడ్డిలో సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి