calender_icon.png 8 September, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి పశువుల కొనుగోలు పారదర్శకంగా జరగాలి

05-09-2025 12:51:40 AM

  1. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

లబ్ధిదారుల అనుమతితోనే పశువుల కొనుగోలు చేపట్టాలి

ప్రతి పాడి పశువుకు తప్పనిసరిగా భీమా సౌకర్యం కల్పించాలి

పాడి పశువుల రీసైక్లింగ్ పాల్పడకుండా పటిష్ట చర్యలు

ఖమ్మం, సెప్టెంబర్4 (విజయ క్రాంతి): ఇందిరా మహిళ డైరీ లబ్దిదారులకు స్వయం ఉపాధికి అందించే పాడి పశువుల కొనుగోలు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.మధిర కేం ద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మధి ర నియోజకవర్గం లో 5 మండలాలలో పైల ట్ ప్రాజెక్టు గా అమలులో భాగంగా ఇం దిరా మహిళ డెయిరీ పాడి పశువుల కోనుగొలు టీం సభ్యులకు గురువారం నిర్వహిం చిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి పాల్గొని, కమిటి సభ్యులకు ది శానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా డెయిరీ కా ర్యక్రమంలో మొత్తం 20 వేల మంది లబ్ధిదారులకు 2 పశువుల చొప్పున 40 వేల పాడి పశువులు పంపిణీ చేయడం జరుగుతుంద ని, మొదటి విడత క్రింద సెప్టెంబర్ 6 నాడు పశువుల కొనుగోలు బృందాలు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఇందిరా మహిళా డె యిరీ ప్రాజెక్టు ఆరంభం నుంచి కట్టుదిట్టంగా జరగాలని, ఎటువంటి అక్రమాలకు ఆస్కా రం ఇవ్వవద్దని అన్నారు.

పశువుల కొనుగో లు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశామ ని, ప్రతి బృందంలో 6 మంది సభ్యులు ఉంటారని అన్నారు.పశువుల కొనుగోలులో ఎటువంటి తప్పులు జరిగినా కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పారదర్శకంగా నాణ్యమైన పశువుల ను కొనుగోలు చేసి ప్రాజెక్టు సక్సెస్ చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

పైరవీలకు తావు లేకుండా ఆసక్తి, అనుభవం ఉన్న లబ్ధిదారులను ముందుగా ఎంపిక చేసి పశువులు అప్పగించాలని, ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులు పశువులు అమ్మడానికి వీలు లేదని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ ఎన్. సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ న వీన్ బాబు, ట్రైబల్ వెల్ఫేర్ డిడి విజయలక్ష్మి, మధిర తహసీల్దారు మండల రాంబాబు, మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్, ఎం పీడివోలు పాల్గొన్నారు.