calender_icon.png 8 September, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

05-09-2025 12:51:01 AM

బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 4 : రైతులను కాం గ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతుందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పే రోజు లు ముందున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. గురువారం బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ నాయకు లు రైతులకు యూరియా కొరత ఉంటే ఎందు కు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా చెన్నూర్ నియోజక వర్గంలోని పలు మండలాలకు లేని యూరియా కొరత మంచిర్యాల నియోజక వర్గంలోని మండలాలకు ఎందుకు వచ్చిందో రైతులు అర్ధం చేసు కోవాలన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడి రైతులకు ఎక్కువ యూరియా బస్తాలు తెప్పిస్తుంటే, ఇక్కడి ఎమ్మెల్యే మిన్నకుండిపోయారని ఆరోపించారు.

అంతకుముందు పట్టణంలోని పలు వీధుల గుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ తీసి హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరి గోపాల్, హేమంత్ రెడ్డి, స్వామి రెడ్డి, రమేష్ జైన్, ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.