04-09-2025 12:00:00 AM
ఆదిలాబాద్, (ఇంద్రవెల్లి) సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లో పంట నీటములుగా, కోత గురైన రోడ్లు, తెగిన బ్రిడ్జిలతో రాకపోకలు లేక అవస్థలు పడుతు న్నారు. తాజాగా బుధవారం జిల్లా కేంద్రం తో పాటు వివిధ మండలాల్లో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు లు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రాజెక్టులకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులన్ని నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సాత్నా ల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ఒక గేటును ఎత్తివేసి నీటి ని దిగువకు వదిలారు. భారీ వర్షాలకు ఇం ద్రవెల్లి మండలంలోని సట్వాజీ గూడా వాగు ఉప్పొంగీ ప్రవహిస్తుంది.
ఓ ఆటో డ్రైవర్ వా గు దాటే ప్రయత్నం చేయగా వరద తాకిడి పెరగడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు కొంత దూరం వరకు వరదలో కొట్టుకుపో గా స్థానికులు వారిని రక్షించాగా, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో అంద రూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది నుజ్జు అయిన ఆటోను బయటికి తీశారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపి వేశారు.
భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని పోలీసులు సూచించారు. అత్యవసర సమయంలో తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలన్నారు.
మహారాష్ర్టకు రాకపోకలు బంద్
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబ ర్ 3 (విజయక్రాంతి): మహారాష్ర్ట నుం డి వరద నీరు భారీగా పెనుగంగలో చేరడంతో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావుపేట మీదనుండి మహారాష్ర్టకు వెళ్లే మార్గమధ్యంలోని పోడసా వదల బ్రిడ్జిపై నుండి వద్దని ప్రవహిస్తుండడంతో మహారాష్ర్టకు రాక పోక లు నిలిచిపోయాయి.
భారీగా వరద నీరు రావడంతో అధికారులు దారిని ముగించారు. పెద్ద ఎత్తున పెనుగంగలోకి వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్‌తో పెనుగంగా పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. పెనుగంగ పరివాహక గ్రామా ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెనుగంగవైపు ఎవరు కూడా వెళ్లావద్దని అధికారులు సూచిస్తున్నారు.