04-09-2025 12:00:00 AM
మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రజ లకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం ఎక్కు వ మొత్తంలో పరిహారం అందించాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును కలిసి విన్నవించారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన కలిసి ఉమ్మడి జిల్లాలో జరిగిన పంట నష్టం దెబ్బతిన్న రోడ్లు తెగిపో యిన చెరువులు కూలిపోయిన ఇన్న వివరాలను వివరించి ఉమ్మడిలాబాద్ జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించేలా చూడాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆత్మీరా శ్యామ్ నాయక్ నారాయణ రెడ్డి లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.