03-09-2025 11:36:15 PM
శాంతియుతంగా నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేయాలి: సీఐ రాంనర్సింహా రెడ్డి
ధర్మపురి,(విజయక్రాంతి): వినాయక నిమజ్జనాల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదనీ సీఐ రాంనర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. వినాయక మండప నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, నిర్వహకులు పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమించితే చట్టపరమైన చర్యలు తప్పవనీ హెచ్చరించారు.