calender_icon.png 2 August, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ హాస్టళ్ల బలవంతపు అగ్రిమెంట్లు

01-08-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, జూలై 31 (విజయ క్రాంతి): కరీంనగర్ తోపాటు కరీంనగర్ ను ఆనుకొని ఉన్న తిమ్మాపూర్ లో పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన ప్రైవేట్ హాస్టళ్ల తీరుపై ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్మతి, శ్రీచైతన్య, వాగీశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు తమ హాస్టల్లో చేరే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతంగా అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.

చదువు పూర్తయ్యే వరకు హాస్టల్ మారమని, అలాగే ఫీజు చెల్లింపు విషయంలో ఎక్కడలేని నిబంధనలు ఆ ప్రతంలో జోడించి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారు. సహజంగా ప్రైవేట్ హాస్టళ్లలో ఉం డే విద్యార్ధినులు, విద్యార్థులకు వసతితోపాటు భోజనం బాగుండాలని చూస్తారు. బాగాలేని సమయంలో హాస్టళ్లను మార్చడం సర్వసాధారణం.

అయితే ఎక్కడలేని విధంగా ఇక్కడ ఈ నిబంధన పత్రాలపై సంతకాలు చేయిస్తూ విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక హాస్టల్ నిర్వాహకుల కుటుంబ సభ్యుల వల్ల కూడా ఇబ్బందులు ఎదు రవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లపై నిఘా, నియంత్రణ లేకపోవడు, చిన్న ఇల్లు దొరికితే చాలు హాస్టళ్లను నిర్వహిస్తుండడం దీనికి కారణంగా చెప్పవచ్చు.

ఇటీ వల తిమ్మాపూర్ సీఐకి, ఎస్‌ఐలకు విద్యార్థినులు హాస్టల్ నిర్వాహకుల మానసిక వేధింపులపై ఫి ర్యాదులు కూడా చేశారు. హాస్టల్ ఖాళీ చేయనివ్వడం లేదు, ఖాళీ చేస్తే డబ్బులు చెల్లించి వెళ్లాలనే నిబంధనలను విధిస్తున్నారంటూ ఫిర్యాదులు వెళ్లాయి. మాదక ద్రవ్యాల నియంత్ర ణతోపాటు ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాకాలపై పోలీసులు నిఘా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులుకోరుతున్నారు.