24-05-2025 12:00:00 AM
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, మే 23 (విజయక్రాంతి): విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యా యుల పాత్ర కీలకమని, ప్రాథమిక దశలో నాణ్యమైన విద్య అందినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
ఉట్నూర్ మండలంలోని లక్కారంలో సమ గ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన 5 రోజుల ప్రాథమిక పాఠశా ల ఉపాధ్యాయుల సామర్థ్య నిర్మాణం శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల వెలువడిన సివిల్ ఫలితాల్లో 76వ ర్యాంకు సాధిం చి సత్తా చాటిన సాయిచైతన్య తల్లిని ఎమ్మె ల్యే శాలువాతో సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారం కృషి చేస్తామని తెలిపారు. విద్యతోనే మనిషికి ప్రత్యేక గుర్తిం పు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.