calender_icon.png 24 May, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదముంపు సమస్య నుంచి రక్షించండి మహాప్రభో

24-05-2025 12:00:00 AM

ఎంసీపీఐ (యు) ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ 21 కార్యాలయం ముట్టడి 

శేరిలింగంపల్లి, మే 23: నాయనమ్మ కుంట వాకింగ్ ట్రాక్ ఎత్తు తగ్గించి ఓంకార్ నగర్ వాసులను వరద ముంపు నుండి రక్షించాలని డిమాండ్ చేస్తూ యంసిపిఐ (యు ) అ ధ్వర్యంలో చందానగర్ సర్కిల్ 21 కార్యాలయాన్ని ముట్టడించారు.

ఈ సందర్బంగా యం సి పీ ఐ( యు) గ్రేటర్ హైదరాబాద్ సహయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ... మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ లో వెనుకబడిన నిరు పేదలు గత 25 సంవత్సరాలుగా ఇండ్లు ని ర్మించుకొని అరకొర సౌకర్యాలతో ఎలాంటి మౌలికవసతులు లేకుండా గుంటలు త్రవ్వుకొని నీరు త్రాగి అనారోగ్య బారిన పడుతున్నారన్నారు.

హైటెక్ సిటీకి ఆమడ దూరం లో ఉన్న ఈ పేద ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకని దుయ్యబట్టారు. స్థానిక కార్పొరేట ర్ పేద ప్రజల ఓట్లు అవసరమే తప్ప వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి చర్య తీసుకోకుండా బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు.

నా యనమ్మ కుంట చెరువు అభివృద్ధి పేరుతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని చెబుతూ చెరువు కట్టను తమ ఇష్టానుసారంగా డైవర్ట్ చేసి పక్కనే ఉన్న ఆక్రమణదారులకు వంత పాడుతున్నారన్నారు. కట్టపై మట్టి ఎత్తుగా పోయ డం వలన పక్కనే ఉన్న ఓంకార్ నగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇండ్లు మునిగి పో తున్నాయని ఓంకార్ నగర్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించకుండా చెరువు కట్ట ఎత్తు పెంచడం వలన ఈ దుస్థితికి కారణం అన్నారు.

ఈ సమస్య పలుసార్లు స్థానిక కార్పొరేటర్,అధికారుల దగ్గరికి తీసుకెళ్లినా పట్టించు కోవడం లేదన్నారు. యంసిపీఐ (యూ) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ ,చందానగర్ సర్కిల్ 21 కార్యాలయాల ఎదుట బస్తీ వాసులతో కలిసి ధర్నా నిర్వహించామన్నారు.

సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రజా ఆందోళన ద్వారానే అధికారులు ,రాజకీయ నాయకుల మెడలు వం చి పనులు చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోయంసిపిఐ( యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, మియాపూర్ డివిజన్ సహాయ కా ర్యదర్శి పల్లె మురళి,పార్టీ గ్రేటర్ నాయకులు అంగడి పుష్ప,విమల, డివిజన్ నాయకులు శివాని పాల్గొన్నారు.