06-09-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యా యుల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు , భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
సమాజంలో అమ్మా,నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారని ,గురువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి గా చాటి చెప్పారని, ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. అంధకారాన్ని తొలగించి అజ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురువని అన్నారు. అలాంటి గురువుల ద్వారా సమాజానికి అవసరమయ్యే భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు.
తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలోనే పోటీపడే విధంగా ఒక్కొక్కటి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తు న్నామని, మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్గొండలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేశామని, పాఠశాలలు, విద్యాసంస్థలలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించి మెరుగైన బోధన అందిం చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
నల్గొండ పార్లమెంటు సభ్యు లు కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, డిఈఓ బిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను ఉత్తమ స్థానంలో నిలపాలి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం మరియు దిగంవత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగాభువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల, విద్యారంగా నికి సంక్షేమానికి పెద్ద పీట వేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. సమాజంలో పవిత్రమైన స్థానం ఉపాధ్యాయుల దని ఆయన కొనియాడారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత గురువులపై ఉందని, అలాంటి గురువులు సమాజంలో గొప్పవారని అన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి, జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టాలన్నారు. టీచర్లు చాలా అద్భుతంగా పాఠాలు విద్యార్థులకు బోధిస్తున్నారు అన్నారు పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో 7వ స్థానం సాధించడంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కృషిని అభినందనీయమ న్నారు.
ఈ సంవత్సరం మొదటి మూడు స్థానాల లోపు ఉండేలా ప్రయత్నం చేయాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ సమాజంలో పవిత్రమైన స్థానం ఉపాధ్యాయుల దని ఆయన కొనియాడారు. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందుతున్న వారి బాధ్యత మరింత పెరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అన్నారు.
జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు క్రమశిక్షణతో, అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియా డారు. అనంతరం 50 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలు, మెమెంటో శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీ జె ఏ సీ ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, విద్యా శాఖ ఏ.డి.ఎన్.ప్రశాంత్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.