calender_icon.png 6 September, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న ఆలయాల మూసివేత

06-09-2025 12:00:00 AM

అలంపూర్, సెప్టెంబర్ 5: రాహుగ్రస్త పాక్షిక చంద్రగహన్ని పురస్కరించుకుని ఈ నెల ఏడో తేదీన మధ్యాహ్నం 1.00 గంట నుంచి అలంపురం శ్రీ జోగుళాంబ,బాల బ్ర హ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.

ఏడో తేదీన ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉభయ ఆలయాల్లో నిర్వహించు ఆర్జిత సేవలు, పౌర్ణమి సందర్భంగా నిర్వహించు చండిహోమాలు యథావిధి కొనసాగుతాయని ఈఓ తెలిపా రు.అనంతరం అదే రోజు మధ్యాహ్నం నుం చి ఆలయాల తలుపులు మూసివేస్తామని వివరించారు.ఎనిమిదో తేదీన సంప్రోక్షణ అనంతరం మహా మంగళ హారతి తో ఆల య తలుపులు తెరిచి ఉదయం 8:30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామ ని పేర్కొన్నారు.