02-08-2025 12:42:07 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, ఆగస్టు 1( విజయ క్రాంతి ): జిల్లాలో ఆర్టిఐ చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అ మలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శు క్రవారం సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు నిర్వహించిన అవగాహన కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సమాచార హక్కు చట్టం కమీషనర్ లు పీ.వీ. శ్రీని వాసరావు, భూపాల్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రె డ్డి లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు సమాచార హక్కు చట్టం కమీషనర్ లు ఖమ్మం జిల్లాలో పర్యటించి పెండింగ్ ఆర్టిఐ దరఖాస్తులపై సమీక్షించి, చట్టంపై అ వగాహన కల్పించారని కలెక్టర్ తెలిపారు.ఆర్టిఐచట్టంపై అధికారులందరికి సమగ్రమైన అవగా హన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని ఆర్టిఐ కమీషన్ లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ తెలి పారు. ఆర్టిఐ కమీషనర్లు అందించిన సూచనలు, సలహాలను ఖమ్మం జిల్లాలోని ప్రజా సమా చార అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, చిన్న చిన్న కారణాల వల్ల సమాచారం ఇ వ్వని కేసులను త్వరగా డిస్పోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సమాచార హక్కు చట్టం కమీషనర్ పి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు పైగా ఆర్టిఐ కమీషన్ లేని కారణంగా 15 వేలకు పైగా కేసులు పెండింగ్ పడ్డాయని అన్నారు. ప్రస్తుతం పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆర్టిఐ కమీషన్ చర్యలు తీసుకుంటుందని అన్నారు. సమాచార హక్కు చట్టం కమీషనర్ భూపాల్ మాట్లాడుతూ ఆర్టిఐ చట్టం ప్రజల్లోకి తీసుకుని వె ళ్ళెందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పని చేయాలని అన్నారు.ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్‌ఓ పద్మశ్రీ,జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు, తదితరులు పాల్గొన్నారు.