02-08-2025 12:39:35 AM
ఎర్రుపాలెం, ఆగస్టు1( విజయ క్రాంతి):మండల పరిధిలోని బంజర గ్రామానికి చెందిన భూక్య కోటి, భూక్య సాయి, ధరావత్ రాజు లు గురువారం నాడు మీనవోలు దగ్గర ఉన్న కట్టలేరు నది లో చేపల వేటకై వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయి మృతి చెందారు. కట్టలేరు నది నుంచి శు క్రవారం ఉదయం ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు నదిలో గాలించి వీరి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.
వీరి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు రోదనలు చూసి స్థానికులు చలించిపోయారు. చనిపోయిన వారు ముగ్గురు రోజువారి కూలి పనులు చేసుకుంటూ కుటుం బాలను పోషించుకొని జీవిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలు గా ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.వీరి మృతదేహాలను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా చేసి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మార్వో ఉషా శారద, వైరా ఏసిపి రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్‌ఐ రమేష్ లు పర్యవేక్షించారు.
చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి: సీపీఎం
బంజారా గ్రామానికి చెందిన ముగ్గురు భూక్య కోటి, భూక్య సాయి, ధరావత్ రాజ లు,ప్రమాదవశాత్తు చేపల వేటకై వచ్చి కట్టలేరు నదిలో పడి చనిపోయిన వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్యల వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు.