28-10-2025 12:40:13 AM
అడిషనల్ ఎస్పీ మహేందర్
రేగోడు, అక్టోబర్ 27 : పోలీస్ అమరవీరులు త్యాగాలు మరువలేనివని జి ల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ అ న్నారు. అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో భాగంగా సోమవారం పో లీస్ స్టేషన్ లో మండలంలోని పోచా రం గ్రామానికి చెందిన అమరుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రా ములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉం టామని ఆయన అన్నారు.
విధి నిర్వహణలో అమరుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాములు సతీమణి సుందరమ్మకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రస న్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, రేగోడు ఎస్త్స్ర పోచయ్య, శంకరంపేట ఎస్త్స్ర ప్రవీణ్ రెడ్డి, అల్లాదుర్గo ఎస్త్స్ర శంకర్, రేగోడు ఎఎస్త్స్ర లు, పెంటప్ప, శంకర్ పోలీస్ సిబ్బంది మండల నాయకులు మాజీ కోఆప్షన్ సభ్యులు చోటు బాయ్, మాజీ సర్పంచ్ మన్నె విజయభాస్కర్, వట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీధర్ గుప్తా, తదితరు లు పాల్గొన్నారు.