24-10-2025 12:54:46 AM
సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాం తి): శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు అమ ర వీరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మ రణ వారోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
అంతకుముందు పోలీస్ హెడ్ క్వార్టర్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పట్టణ పురవీధుల్లో సాగిన సైకిల్ ర్యాలీలో ఎస్పీ స్వయం గా సైకిల్‌ని తొక్కుతూ పోలీస్ అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ లు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, ఇంద్ర వర్ధన్, పట్టణ సిఐలు పాల్గొన్నారు.