24-10-2025 12:53:07 AM
మంచిర్యాల, అక్టోబర్ 23 (విజయక్రాం తి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ సర్కిల్‌ల పరిధిలోని 73 ఏ4 మద్యం దుకాణాలకు 1712 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా మద్యపాన శాఖ అధికారి నందగోపాల్ గురువారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 27 వ తేదీన శ్రీరాంపూర్‌లోని పివిఆర్ గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.