calender_icon.png 17 January, 2026 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి

17-01-2026 12:00:00 AM

గరిడేపల్లి, జనవరి 16 : దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని ప్రతి జవాన్ భరతమాత ముద్దుబిడ్డ అని రాపోల్ నవీన్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని కల్మలచెరువు గ్రామంలో గురువారం భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ సరిహద్దులలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ స్థానికుడు సైనిక దళములో పనిచేస్తున్న వట్టే దశరథ యాదవ్ ను శాలవులతో ఘనంగా సన్మానించి పాలతో కాళ్లు కడిగి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచు కొండలలో అత్యంత కఠినమైన పరిస్థితులలో యుద్ధం చేస్తూ దేశ రక్షణ తన జీవిత ఆశయంగా బతుకుతున్న ప్రతి జవాన్ భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవానులందరికీ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశభక్తిని చాటుతూ సైనికుడిని గౌరవించిన నవీన్ కుమార్ తీరును గ్రామస్తులు అభినందించారు.