calender_icon.png 17 January, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదు

17-01-2026 11:12:49 AM

న్యాయపరంగా ర్యాలీ చేస్తాం

హైదరాబాద్: తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి సికింద్రాబాద్ ర్యాలీకి వెళ్తేందుకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ర్యాలీకి వెళ్తేందుకు యత్నిస్తున్న కేటీఆర్, పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని న్యాయపరంగా మళ్లీ ర్యాలీ  చేస్తామని తలసాని (Talasani Srinivas Yadav) వెల్లడించారు. తమది శాంతియుతమైన ర్యాలీ.. అందరినీ ఆహ్వానించామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. బీఆర్ఎస్ ర్యాలీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి తమకు హక్కు లేదా? అని తలసాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ర్యాలీకి చేసేందుకు 5 రోజుల క్రితమే తాము అనుమతి కోరితే, శుక్రవారం రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారని తలసాని ఫైర్ అయ్యారు. ర్యాలీకి అనుమతి లేదని ముందు చెబితే కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకునే వాళ్ళమని పేర్కొన్నారు. అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చ? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వాళ్లను అరెస్ట్ చేస్తారు... తాము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూను తలిచినట్లు వేలాది మంది పోలీసులను పెట్టి అందరిని అరెస్టులు చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.  బీఆర్ఎస్ సికింద్రాబాద్ ర్యాలీకి అనుమతి లేదని నార్త్ జోన్ జాయింట్ సీపీ ప్రకటించారు.