17-01-2026 12:00:00 AM
నల్లగొండ క్రైం, జనవరి 16 : విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి ఒక ల్యాప్ టాప్, పలు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బంగారు పల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ళ లీలకృష్ణ జిల్లాలో నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని విదే శాల్లో ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో పోలేపల్లి రాంనగర్కు చెందిన కోయల కార్ కరుణభాయి తన కుమారుడిని విదేశాలకు పంపిం చి ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశాడనీ పిర్యాదు చేయడంతో చింతపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. దీంతో ముప్పాళ్ల లీలాకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా, ఇతడు నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు విద్యార్థుల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. నిందితుడు గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడి పరిచయాలను ఉపయోగించుకొని, భారతదేశానికి వచ్చిన అనంతరం చెడు వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపా దించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడుతున్నాడన్నారు.
విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి ఇప్పటివరకు మొత్తం 8 మంది నుండి సుమారు రూ.85 లక్షల వరకు తీసుకొని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. ఇలా సంపాదించిన డబ్బులతో నిందితుడు విలాసాలకు , జల్సాలకు అలవాటుపడ్డాడన్నారు. నిందితుడు మాల్ గ్రామం మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా గుర్తించిన చింతపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు ఈ కేసులో నేరస్థుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నాంపల్లి సీఐ డి.రాజు, చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామ్మూర్తి పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించారు.