22-10-2025 12:00:00 AM
పోలీస్ అమరవీరుల సంస్మరణలో సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట అక్టోబర్ 21 (విజయక్రాంతి): పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్.ఎం. విజయ్కుమార్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో జిల్లాలో విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు పుష్పగుచ్ఛాలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.1959 అక్టోబర్ 21న లడక్లో చైనా సైన్యం దాడిలో మరణించిన పోలీసు జవాన్ల స్మారకార్థం ప్రతి ఏటా అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధినిర్వహణలో 191 మంది పోలీసులు వీరమరణం పొందినట్లు వెల్లడించారు. మహిళల రక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నందుకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అమరవీరుల కుటుంబ సభ్యులతో అల్పాహారం చేసిన కలెక్టర్
మెదక్, అక్టోబర్ 21 : పోలీసు అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ మెదక్ పట్టణంలోని ఎస్పీపేరేడు గ్రౌండ్లో పోలీస్ అమరవీరులసంస్మరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ, వారి కుటుంబ సభ్యులతో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమరుల కుటుంబ సభ్యులతో అల్పాహారం తిన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్యసహసాలే ప్రధానమన్నారు. మెదక్ జిల్లాలో కూడా గత 20 సంవత్సరాలలో అసాంఘిక కారణాలవల్ల చాలామంది పోలీసులు చనిపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు చాలా గొప్పవి అని, ప్రతి సంవత్సరం అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ ధైర్యసహసాలతో పోలీసు డిపార్ట్మెంట్ మరింత ముందుకెళ్లాలని తెలిపారు.
తూప్రాన్‌లో..
తూప్రాన్ : ప్రజలు పోలీసులతో మమేకమై ఉండాలని, ప్రజల సంరక్షణ పోలీసుల ధ్యేయమని తూప్రాన్ డి.ఎస్.పి నరేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని అమరవీరుడు డీఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్, తూప్రాన్ ఎస్‌ఐ యదగిరి, వెల్దుర్తి ఎస్‌ఐ రాజు, ఎస్‌ఐ జ్యోతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పాపన్నపేటలో..
పాపన్నపేట : పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పాపన్నపేట ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 సెప్టెంబర్ 13న పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను మావోయిస్టులు పేల్చివేయడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో అమరులైన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ రఘునందన్, కానిస్టేబుళ్లు అబేద్ హుస్సేన్, రాంచందర్, ప్రసాద్, నర్సింలు చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఎస్త్స్ర తుక్కయ్య, కానిస్టేబుళ్లు శివకుమార్, నర్సింలు, వెంకటేష్, యాదగిరి, నాగలక్ష్మీ, తదితరులున్నారు.
సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : విధి నిర్వహణలో పోలీసుల త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య కొనియాడారు. మంగళవారం పోలీసు అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ సంగారెడ్డి పట్టణంలోని ఎస్పీ పేరేడు గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
అంతరం కలెక్టర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ, వారి కుటుంబ సభ్యులతో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాల సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
సంగారెడ్డి పోలీస్ అంటేనే ధైర్యానికి చిరునామ అన్నారు. విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేశారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్యసహసాలే ప్రధానమన్నారు. జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో 1959లో జరిగిన చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది వీరుల స్మారకార్థంగా ఈ రోజును జరుపుకోవడం మనందరి బాధ్యత అని, వారి ధైర్యసాహసాలు, దేశభక్తి భావితరాలకు ఎంతో ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, శ్రీనివాస రావు, సంగారెడ్డి డీయస్పీలు సత్యయ్య గౌడ్, సైదా నాయక్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఎస్బి ఇన్స్పెక్టర్స్ కిరణ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు రామరావు, పరేడ్ కమాండర్లు రాజశేఖర్ రెడ్డి, డానియెల్ పాల్గొన్నారు.
జహీరాబాద్‌లో పోలీస్ సంస్మరణ దినోత్సవ ర్యాలీ
జహీరాబాద్ టౌన్, అక్టోబర్ 21 : జహీరాబాద్లో పోలీసు అమరవీరుల సంస్థరణ దినో త్సవ ర్యాలీని మంగళవారం స్థానిక డీఎస్పీ సైదానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసు అమరులకు నివాళులు అర్పించారు. జహీరాబాద్ టౌన్ పీ ఎస్ నుంచి సిద్దిహోటల్ వరకు హెల్మెట్ బైక్ ర్యాలిని నిర్వహించారు. సర్కి ల్ సి.ఐ శివలింగం, పట్టణ ఎస్.ఐ కె.వినయ్ కుమార్, సిబ్బందిపాల్గొన్నారు.