calender_icon.png 22 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరమ్మతులకు నోచుకోని బీటీ రోడ్లు

22-10-2025 12:00:00 AM

  1. పట్టించుకోని అధికారులు 
  2. అవస్థలు పడుతున్న ప్రజలు 
  3. మరమ్మతులు చేపట్టేది ఎప్పుడో..?

కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో తారు రోడ్లు శిథిలావస్థలోకి చేరుకున్నాయి. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి మద్దికుంట రోడ్డు అధ్వానంగా మారింది. మద్దికుంట గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు వివరించిన నిధులు మంజూరు చేయడం లేదు.

మద్దికుంటలో ప్రసిద్ధి చెందిన బుగ్గ రామలింగేశ్వర ఆలయం కు వెళ్లేందుకు భక్తులు బైకులపై వస్తుంటారు. బీటి రోడ్డు మొత్తం అద్వానంగా మారింది. రామారెడ్డి ఇసన్నపల్లి నుంచి మద్దికుంట గ్రామానికి వెళ్లే తారు రోడ్డు పలుచోట్ల ధ్వంసం అయింది. మరమ్మతులు చేపట్టకపోవడంతో స్థానిక గ్రామాల ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

అధికారులు ఇప్పటికైనా పట్టించుకోని బీటీ రోడ్డు పనులు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట గ్రామానికి వెళ్లే తారు రోడ్డు శిథిలావస్థకు చేరుకుంది. నూతనంగా నిర్మించేందుకు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన పూర్తి చేయకపోవడంతో నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. 

ఇలాంటి రోడ్లు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో తారు రోడ్లు శిథిలావస్థకు చేరి ప్రయాణికు లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి శిథిలావస్థకు చేరిన తారు రోడ్లకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తారు రోడ్ల కు మరమ్మతు లు చేపడతారని ఆశిద్దాం.