calender_icon.png 22 October, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల త్యాగాలు మరువలేనివి

22-10-2025 12:51:39 AM

- శాంతిభద్రత లు, ప్రజారక్షణే ధ్యేయంగా నిత్య పోరాటం

-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

-అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు

నల్లగొండ, అక్టోబర్ 21 : శాంతి భద్రతలలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేమని జిల్లా కలక్టర్ ఇలా త్రి పాటి అన్నారు. అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ..;;పోలీస్ శాఖ దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజా రక్షణకు విది నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రాణ త్యాగాలతో పాటు ఎటువంటి సెలవులు లేకుండా ప్రజల రక్షణే ద్వేయంగా పని చేయడం చాలా గొప్ప విషయం; అన్నారు.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎందరో అమరులయ్యారని వారి త్యాగాలు మరవలేనివి అన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు రాష్ర్ట ప్రభుత్వం స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరిగిందనీ,ఇప్పటి వరకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ నాలుగు ఖాళీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. పోలీస్ అమరవీరుల స్మృతి ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు; జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటామని తెలిపారు. జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణకు విది నిర్వహణలో ఎంతో మంది అమారులవుతున్నారనీ, వారి త్యాగాలను గుర్తు చేసు కుంటూ అక్టోబర్ 21 అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటు న్నామని తెలిపారు.

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విది నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులతో; పోరాడి 191 మంది పోలీసులు అమరులైనారనీ, వారిలో మన తెలంగాణ రాష్ర్టంలో ఐదుగురు ఉన్నారని తెలిపారు.ఎందరో పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను లెక్కచేయకుండా విధి నిర్వాహణలో వారి ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని అన్నారు. వారి త్యాగం వలనే నేడు; శాంతియుత వాతవరణం నెలకొన్నదని, ప్రజలు కూడా శాంతి యుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలు మరవలేనివి; అన్నారు. పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ లో నిత్యం; పోరాటం చేస్తున్నారని, మన జిల్లా లో ఇప్పటి వరకు 15 మంది విది నిర్వహణ అమరులైనారని అమరవీరులైన; కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ; అండగా ఉంటుంది అని అన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 (పోలీస్ ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో నేటి నుండి ఈ నెల 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు పోలీస్ ఓపెన్ హౌస్,మెగా రక్తదాన శిబిరాలు,షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,సైకిల్ ర్యాలీ; కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, అడిషనల్ ఎస్పి రమేష్, యస్.బి డీఎస్పీ మల్లారెడ్డి నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవ రావు, రాము, మహా లక్ష్మ య్య, రాజశేఖర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి,శ్రీను నాయక్,సురేష్,చంద్ర శేఖర్ రెడ్డి,ఆర్.ఐ లు సంతోష్, శ్రీను, హరిబాబు,సూరప్ప నాయుడు, నరసింహ ఎస్.ఐలు, ఆర్.ఎస్. ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం:  కలెక్టర్ 

సూర్యాపేట, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : సమాజ అభివృద్ధికి పోలీసులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహతో కలిసి పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూజ రోజూ రోజుకు సమాజంలో పోలీసు బాధ్యత పెరుగుతుందన్నారు.

అందుకనుగుణంగా పోలీసు సిబ్బంది కూడా అన్ని పరిస్థితులకు ఎదురు నిలుస్తూ జిల్లాలో పోలీసు సిబ్బంది బాధ్యతగా విధులను నిర్వర్తిస్తున్నారన్నారు, దేశంలో రాష్ర్టంలో ప్రజలు సంతోషంగా జీవించాలి అంటే పోలీసు సిబ్బంది త్యాగాలు చేయక తప్పదన్నారు. పోలీసు విధులకు సహకరిస్తూ వారి కుటుంబాలు కూడా త్యాగాలు చేస్తున్నాయన్నారు. పోలీస్ సిబ్బంది ప్యాషన్ తో పనిచేస్తున్నారని ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ర్ట పోలీస్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు. తదుపరి ఎస్పీ నరసింహ  మాట్లాడుతూ   నేటి ప్రశాంత సమాజం పోలీసు అమరవీరుల ప్రాణాల త్యాగ ఫలితమేనని, శాంతిభద్రతలు కాపాడుటలో పోలీసు 24 గంటలు నిర్విరామంగా  కృషి చేస్తున్నారన్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో నేరస్తుని దాడిలో అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజల తరఫున జిల్లా పోలీస్ శాఖ తరపున నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. తదుపరి 2015 ఏప్రిల్ ఒకటవ తేదీన జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ కుటుంబాలకు 200 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి వారికి పట్టా అందించారు.

అలాగే జిల్లాలో అమరులైన హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్, కానిస్టేబుల్ లింగయ్య హోంగార్డు మహేశ్వర్ ల పిలల్లకు చదువుల ఖర్చులకు గాను జిల్లా కలెక్టర్ నిధుల నుండి ఆర్థిక సహాయం అందించారు. తదుపరి గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా శాంతిభద్రతల, ప్రజల రక్షణలో విధులు నిర్వర్తిస్తూ అసాంఘిక శక్తుల చేతుల్లో అమరులైన 191 మంది పోలీసు జవాన్లను స్మరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి ప్రసన్నకుమార్, డిఎస్పి నర్సింహ చారి, డిఎస్పి రవి, ఏవో మంజు భార్గవి, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, సిఐలు శివశంకర్, రాజశేఖర్, నాగేశ్వరరావు, నరసింహారావు, వెంక టయ్య, రామకృష్ణా రెడ్డి, ప్రతాప్, అర్‌ఎస్సు లు ఎం.అశోక్, కె.అశోక్, సురేష్, సాయిరాం, రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

త్యాగాలు మరువలేనివి: ప్రభుత్వ విప్ 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 21 ( విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివి అని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీరామ్ విల్లాస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐలయ్య మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను పరిరక్షించడంలో తమ వంతు పాత్ర వహించాలని సంఘవిద్ర శక్తులను తరిమికొట్టడంలో ప్రజల పాత్ర ముఖ్యమైనది అన్నారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముందు పోలీస్ స్టేషన్ నుండి  ర్యాలీ నిర్వహించారు. ఎసిపి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సంస్కరణ సభలో స్థానిక నాయకులు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామ్ విల్లాస్ ను అభినందించారు.

పోలీసుల సేవలు వెలకట్టలేనివి: సీఐ చరమంద రాజు

హుజూర్ నగర్, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి అని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు,శాంతి సంఘం అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం హుజూర్ నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాంతి స్తూపం వద్ద సర్కిల్ లోని పోలీస్ అధికారులు, శాంతి సంఘం ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ చరమందరాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎంతోమంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారన్నారు.విధుల్లో ప్రాణాలు వదిలిన వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎస్సులు బండి మోహన్,బాబు,నరేష్, కోటేష్,రవీందర్,కోడి ఉపేందర్, జక్కుల మల్లయ్య,గల్లా వెంకటేశ్వర్లు,మేళ్లచెరువు ముక్కంటి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.