calender_icon.png 29 January, 2026 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దందా ఫుల్.. నిఘా నిల్

29-01-2026 12:00:00 AM

ఎండపల్లిలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక దందా

పట్టపగలే పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్ల హడావిడి

రెవిన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో దందా

పట్టించుకోని అధికారులు

ధర్మపురి,జనవరి 28(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణాపై అధికారుల నిఘా లేకపోవడంతో ‘విజయక్రాంతి‘ కథనాలతో కొన్ని రోజులు నిలిచిపోయిన అక్రమ ఇసుక రవా ణా మళ్ళీ జోరుగా మొదలయింది. పట్టపగలే ఎoడపల్లి మండల తహసీల్దార్ కార్యా లయానికి కూతవేటు దూరంలో రాజారాంపల్లి కేంద్రంగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ రెవిన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అధికారుల కనుసన్నల్లోనే ఇ సుక అక్రమ రవాణా కొనసాగుతుందనే వి మర్శలు బహిరంగగానే వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ గృహ నిర్మాణాలకోసం అంటూ పెద్ద పెద్ద భవనాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నపటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సంబంధిత ఉన్నతశాఖల అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వెయ్యాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.