18-12-2025 02:10:46 AM
భీమదేవరపల్లి, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడు సన్నిధిలోధనుర్మాసం ఆరంభం (సంక్రాంతి నెలపట్టుట) శ్రీ కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి పర్వదినాన అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును.
ఈ కార్యక్రమం నిర్వహించుటకు గాను నెల ముందుగా ధనుర్మాసంలో పత్రిక లిఖించి జరిపే ఆరంభ క్రతువు గణపతి పూజ, శైవశుద్ధి, పుణ్యాహవాచనం గావించి నిర్వహించీ ప్రదక్షణ క్రమంగా అమ్మవారి ఆలయంలోకి వేంచేసి కుంభ స్థాపన గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు అర్చకులు కే రాజయ్య, మొగిలిపాలెం రాంబాబు, తాటికొండ వీరభద్రయ్య, గుడ్ల శ్రీకాంత్ ,తాటికొండ వినయ్, జానకిపురం రవి శర్మ తదితరులు పాల్గొన్నారు.