calender_icon.png 30 December, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్

29-12-2025 01:42:43 AM

కంపెల్లి సతీష్ కుమార్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

సుల్తానాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలో ఎన్నికైన స్వతంత్ర గ్రామ సర్పంచి కంపెల్లి సతీష్ కుమార్, వార్డు సభ్యులు ము త్యం జ్యోశీల,దుగ్యల భూంరావు లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీరుకుల్లా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం చంద్రయ్య గౌడ్, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.