calender_icon.png 30 December, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కాంగ్రెస్

29-12-2025 01:41:20 AM

చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం

కరీంనగర్, డిసెంబరు 28 (విజయ క్రాంతి): దేశానికి స్వతంత్రాన్ని సాధించిపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిసిసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్క రించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి నేటికి 141 సంవత్సరాలు పూర్తవుతున్నదని తెలిపారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ఏర్పడిన జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఆ పోరాటంలో పాల్గొనడంతో స్వా తంత్రం సిద్ధించిందన్నారు.

ఆ సమయంలో దేశంలో చాలా గ్రామాలలో కనీసం కరెంటు లేని పరిస్థితి, ఒక గుండు సూది తయారు చేయలేని పరిస్థితుల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సారి దేశంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గొప్ప దార్శనికతతో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపించి, ఆహార భద్రతకు సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు జరగడం ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్థాపించడం కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అయ్యిందన్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆరేపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, పత్తి మధుకర్ రెడ్డి, మడుపు మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, మల్యాల సుజిత్ కుమార్, చర్ల పద్మ, వెన్నం రజిత రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రహమాన్, మహమ్మద్ అజీమ్, ములకల ప్రవీణ్, మునిగంటి అనిల్, కల్వల రామ్ చందర్, వంగల విద్య సాగర్, సరీళ్ల రతన్ రాజు, దన్ను సింగ్, తదితరులు పాల్గొన్నారు.