calender_icon.png 30 December, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమం

29-12-2025 01:42:44 AM

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్ గౌడ్

ఇల్లందు టౌన్, డిసెంబర్ 28, (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలు ఏకమై ఉద్యమాన్ని ముందుకు నడపాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఇల్లందు పట్టణంలోని ఏక్తా హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం డిసెంబర్ 31న హైదరాబాద్లో అఖిలపక్ష నాయకులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, విద్యార్థులు, కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లి పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ రథయాత్రను ప్రారంభించి రెండు నెలల పాటు పట్టణాలు, పల్లెల్లో కొనసాగిస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, పట్టణాల్లో బీసీ సంఘాలను ఏకం చేసి సభలు నిర్వహించి మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి బీసీ కులాల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు. మేమెంతో మాకంత అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఏప్రిల్ చివరి వారంలో లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మామిడి శివ, మేకల మల్లేష్ యాదవ్, కోటగిరి రాజేందర్, కోడి రాజు, మునాఫ్, ఊట్ల రాజేష్, సదానందం, సతీష్ గౌడ్, ఏక్తా హౌస్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.