18-12-2025 12:06:18 AM
కరింనగర్, డిసెంబర్17(విజయక్రాంతి): ఇటీవల గెలిచిన కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ లను కలిశారు.మంత్రులు గెలిచిన సర్పంచులను అభినందించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకాలు అమలయ్యే విధంగా చూడాలని సూచించారు.
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఏఏ గ్రామాలకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు రూపొందించి ఇవ్వాలని సూచించారు.సర్పంచుల గెలుపుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.మంత్రులను కలిసిన వారిలో చర్లభూత్కూర్,చామనిపల్లి,దుబ్బపల్లి బహదూర్ఖాన్ పేట్,జూబ్లీ నగర్, ఎలబోతారం,ఫకీర్ పేట్,చేగుర్తి, నల్లగుంట పల్లె సర్పంచులు ఉపసర్పంచులు ఇరుకుల్ల ఉప సర్పంచ్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాంరెడ్డి రాంరెడ్డి,పంజాల స్వామి గౌడ్,నాయకులు పెంచాల లక్ష్మణ్ రావు,బుర్ర నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.