15-12-2025 12:00:00 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో ముగిశాయి. ఆదివారం జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగగా, జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పా ట్లు చేపట్టింది. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బం దీ ఏర్పాట్లు చేసింది. 2వ విడత ఎన్నికల్లో మొత్తం 156 పంచాయతీలు ఉండగా, అం దులో ఇప్పటికే 17 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
దీంతో మిగిలిన 139 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉద యం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సజావుగానే సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా సవ్యంగా సాగేలా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవే క్షించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖి చేసిన అనంతరం లోనికి పంపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 bns సెక్షన్ ను అమలు చేసి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటు వంటి అవాంచనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీస్ యంత్రాం గం తగు చర్యలు చేపట్టింది. దీంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది.
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో అత్యధికంగా భోరజ్ లో 89.27 శాతం, అత్యల్పంగా బెలలో 84.85 పోలింగ్ శాతం నమోదయింది. ఎనిమిది మండలాలను కలుపుకుని సరాసరిగా 86.68 పోలిం గ్ శాతం నమో దైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. పోలింగ్ కేంద్రం లో ఓటు కోసం వచ్చే వారి కోసం సెల్ఫీ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఓటర్లతో కలిపి సెల్ఫీ పాయింట్లు వద్ద ఫోటోలు దిగుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఉదయం వేళ భారీగా పోలింగ్..
ఆదివారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కాగ పల్లె వాసులు ఓట రు చైతన్యం కనబరిచారు. చలి తీవ్రత ను సైతం లెక్క చేయకుండా ఉదయం నుండే ఓటర్లు క్యూ లైన్ లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారు లు తీరారు. ఉదయం వేళ ఓటర్లు పెద్ద సంఖ్యలో రాగా ఆ తర్వాత క్రమంగా ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అభ్యర్థులు సైతం తమకు అనుకూలంగా ఓటు వేసే వారిని గుర్తించి వారిని ప్రత్యేకంగా ఆటోలలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతో మధ్యాహ్నంతో పోలిస్తే ఉదయం వేళనే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసి మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారం భం కాగా తొలుత వార్డు మెంబర్ల కౌంటింగ్ ను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ పూర్తి చేశారు.
పటిష్ట పోలీస్ బందోబస్తు.. 27 కేసుల నమోదు
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది మండలాలలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎన్నికల విధులను నిర్వహిస్తున్న పోలీసులకు అడ్డుపడిన, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, మద్యం, ఆహా ర పదార్ధాలు, బహుమతులు పంచుతూ దొరికిన వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లగించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్ర సమస్యలు తలెత్తకుండా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.