calender_icon.png 18 July, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో యువకుని దారుణ హత్య

17-07-2025 12:26:00 AM

అక్రమ సంబంధం మే హత్యకు కారణమా...?, విచారణ చేపట్టిన పోలీసులు 

కామారెడ్డి, జూలై 16 (విజయ క్రాంతి), అక్రమ సంబంధం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నేపంతో  ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన ఇది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికే రమేష్ (36) కు గత పది సంవత్సరాల క్రితం మా దేవి తో వివాహం జరిగింది.

వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత సంవత్సరం నుండి గొడవలు జరగడంతో భార్య మహాదేవి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుండి రమేష్ మారేడు గుడి దగ్గర ఉన్న పటేల్ మారుతి ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం ఉదయం 6 గంటలకు పెద్ద దేవాడ గ్రామానికి చెందిన కాశీనాథ్ హైదరాబాద్ నుండి వచ్చి రమేష్ వద్దకు వెళ్లి ఉదయం 6 గంటలకు రమేష్ ఇంటి నుండి బయటకు రాగానే కాశీనాథ్ పంచాయతీలో ఉన్న కత్తితో రమేష్ తల పైన వీపులో నరికి హత్య చేశాడు.

రమేష్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి  చెందాడు. గత కొన్ని సంవత్సరాలు గా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే నేపథంతో పెద్ద దేవాడకు చెందిన ఉండే వార్ కాశీనాథ్ హైదరాబాద్ నుంచిబుధవారం ఉదయం వచ్చి వేట కొడవలితో రమేష్ పై దాడి చేశాడు. అక్కడికక్కడే రమేష్ కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఇంటి యజమాని పటేల్ మారుతి మృతుని తల్లి అరికే వార్ గంగ మనకి తెలుపగా సంఘటన స్థలానికి వచ్చి చూడగా తన కొడుకు రమేష్ రక్తమడుగులో పడి చనిపోయి ఉన్నాడని తన  కొడుకు చావుకు కాశీ నాథ్ ఆని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాశీ నాథ్ భార్య శ్యామలకు రమేష్ కు అక్రమ సంబంధం ఉందనే కారణంతోనే కాశీనాథ్ తన కొడుకుని హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారణాలను తెలుసుకున్నారు. హత్యకు కారణం అక్రమ సంబంధ మనే మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బీచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.