calender_icon.png 20 November, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు మూడు విడతల ప్రణాళిక

20-11-2025 08:42:35 PM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని

సిద్దిపేట కలెక్టరేట్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డైరెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించే కార్యచరణ రూపొందించాలని తెలిపారు.

ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లు,శాంతి భద్రతలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. పరిశీలకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, 2024 ఎస్ఈఈ ఈపిసి సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ కే.హైమావతి మాట్లాడుతూ,మూడు దశల్లో జరుగనున్న ఎన్నికలకు అనుగుణంగా మండలాల వారీగా షెడ్యూల్ సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. శాంతి భద్రతలు, సిబ్బంది కేటాయింపుపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పి సీఈఓ రమేష్, డిపిఓ విజయకుమార్, డీఆర్‌డిఓ జయదేవార్య, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.