calender_icon.png 12 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తహీనతను తగ్గించే నేరేడు

06-07-2025 12:00:00 AM

నేరేడుని చూస్తే.. తినకుండా ఉండలేం. Sour, spicy, తీపి కలగలిపిన రుచిలో ఉండే ఇవి.. మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

- మహిళల్లో కనిపించే సమస్య.. రక్తహీనతను నేరేడు తగ్గించగలదట. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటంతో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సాయపడుతుంది.

- హార్మోన్ల అసమతుల్యత కారణంగా కలిగే పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలపై నేరేడు సహజంగా ప్రభావం చూపిస్తుంది. వాటి హెచ్చుతగ్గులను సమం చేస్తుంది.

- మెనోపాజ్ తర్వాత ఎముకల బలం తగ్గుతుంది. నేరేడుని తీసుకుంటే ఇందులో పుష్కలంగా దొరికే క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

- నేరేడు.. గర్భధారణకు సిద్ధమవుతున్న మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండటంతో పాటు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియలు మెరుగుపడి.. అతి ఆకలి అదుపులోకి వస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.