13-12-2025 12:00:00 AM
అమీన్‌పూర్, డిసెంబర్ 12(విజయక్రాంతి): మద్యానికి బానిసై మామను అల్లు డు హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో గురువారం రాత్రి జరిగింది. బీరంగూడలో నివాసం ఉంటున్న చిత్తారి చంద్రయ్య(57) కూతురులకి రామకృష్ణ అనే వ్యక్తితో 2005లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రామకృష్ణ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. గత మూడు నెల ల క్రితం గొడవ జరగడంతో లక్ష్మీ తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది.
ఈనెల 11న రాత్రి మద్యం సేవించిన రామకృష్ణ అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. కూతురును కొడుతున్నాడని అల్లుడిని చంద్రయ్య బయటకు గెంటివేశాడు. తీవ్రకోపంతో రగిలిపోయిన రామకృష్ణ నీ అంతు చూస్తానంటూ బయటకు వెళ్లి అరగంట తర్వాత కూరగాయలు కోసే కత్తితో చంద్రయ్యపై విచక్షణా రహితంగా పొడిచాడు. గాయపడ్డ చంద్రయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ నరేశ్ తెలిపారు. మృతుని కూతురు కడమంచి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.