13-12-2025 12:04:43 AM
పేదలు, కార్మిక కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
చుంచుపల్లి, డిసెంబర్ 12, (విజయక్రాంతి): సింగరేణి కార్మిక వాడలు, ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న మాజీ కార్మికులకు ఉంటామని, సంస్థ క్వార్టర్లలో, సింగరేణి స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న మాజీ కార్మిక కుటుంబాలకు, కాంట్రాక్టు కార్మికులకు, సంస్థపై పరోక్షంగా ఆధారపడ్డ పేద కుటుంబాల ఇండ్లు, ఇండ్ల స్థలాలపై హక్కులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కార్మి కప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలైన గౌతంపూర్, రుద్రంపూర్, ఫోర్ ఇంక్లైన్, ప్రశాంతి నగర్, రామాంజనేయ కాలనీ, బాబు క్యాం పు, ఎన్ కె నగర్, నందా తండా, చుంచుపల్లి పంచాయతీల పరిధిలో కూనంనేని విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా బస్తీ, గ్రామ సెంటర్లలో జరిగిన సభల్లో కూనంనేని మాట్లాడుతూ మాజీ కార్మికులు, పేదలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు నివసిస్తున్న పాత క్వార్టర్లు, సింగరేణి స్థలాల నుంచి వెళ్లగొట్టె సింగరేణి చర్యలకు స్వస్తి చెప్పి స్వేచ్ఛగా నివసించే వెసులుబాటు కల్పించామన్నారు.
సింగరేణి సేఫ్ నిధులతో ప్రభావిత గ్రామాల అభివృద్ధి, కార్మికవాడల్లో మౌలికవసతుల కల్పనకు కృషి జరిగిందన్నారు. కార్మికులు, పెదాలు, మాజీ కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. అనునిత్యం ప్రజల వెన్నంటి ఉంది వారి కస్టాలు, సమస్యలపై స్పందించి తీర్చేది కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులేనని 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపి ఐ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎన్నికల సమయంలో డబ్బు మూ టలతొ వచ్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, దుర్గరాసి వెంకటేశ్వర్లు, జి వీరస్వా మి, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జునరావు, పొలమూరి శ్రీనివాస్, యాండ్ర మహేష్, పొలమూరి శ్రీనివాస్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.